షాకింగ్ వీడియో.. నా కూతురినే ప్రేమిస్తావా.. నడిరోడ్డుపై సుత్తి, ఇనుప రాడుతో..

by  |
షాకింగ్ వీడియో.. నా కూతురినే ప్రేమిస్తావా.. నడిరోడ్డుపై సుత్తి, ఇనుప రాడుతో..
X

దిశ, వెబ్‌డెస్క్ : తన కూతురిని ఓ యువకుడు ప్రేమించాడని.. సదరు యువతి.. తండ్రి, సోదరుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఇనుప సుత్తి, రాడుతో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పక్ భావ్సర్(22), మక్సి నగరానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు.

వీరిద్దరూ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇళ్ల నుంచి పారిపోయారు. అనంతరం యువతి తల్లిదండ్రులు, పెద్దలు వారిని ఇంటికి రావాలని కోరారు. ఈ క్రమంలో వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. అయితే ముందు నుంచి యువతి కుటుంబ సభ్యులకు పుష్పక్ అంటే ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పుష్పక్‌ కటింగ్‌ షాప్‌లో కటింగ్‌ చేసుకుంటున్న సమయంలో యువతి తండ్రి, అన్న ఒక్కసారిగా షాప్‌ నుంచి అతన్ని బయటకు లాక్కొచ్చారు.

మక్సీ వీధిలో వెంబడించి మరీ సుత్తి, ఇనుప రాడ్‌తో పుష్పక్‌పై దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో పుష్పక్‌ కాలు, చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాడి అనంతరం యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి, అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై దాడి చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed