- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డొనాల్డ్ ట్రంప్ వైఖరి ప్రపంచానికి ఇచ్చే హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్ వైఖరి, వివాదాస్పద వ్యాఖ్యలు, నాయకత్వ శైలి ప్రపంచ రాజకీయాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? అధికారం, అహంకారం, బాధ్యతలపై విశ్లేషణాత్మక అభిప్రాయం.

ప్రపంచ చరిత్రలో అధికారం మనిషిని ఎంతగా విధ్వంసం చేయగలదో తెలుసుకోవాలంటే, డొనాల్డ్ ట్రంప్‌ను చూస్తే చాలు.. ఆయన కేవలం అమెరికా అధ్యక్షుడు మాత్రమే కాదు, ఒక పెద్ద అద్దం పట్టుకున్న వ్యక్తి. ఆ అద్దంలో ఆయనకు తన తప్ప మరెవరూ కని పించరు. తనకు నోటికి వచ్చినట్లు మాట్లాడటం, తనకు తోచినట్లు ప్రవర్తించడం, తనకు నచ్చిన వారిని మిత్రులుగా, తనను విమర్శించిన వారిని శత్రువులుగా మార్చుకోవడం.. ఇది ట్రంప్ సహజ జీన్స్ లక్షణం. రాజకీయ జీవిత సారాంశం కూడా..
ఏసుక్రీస్తుగా చిత్రణ..
ఇటీవల వాటికన్ సిటీలో జరిగిన ఘటన ట్రంప్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. పోప్ లియో-14, ప్రపంచ శాంతి కోసం తపించే ఒక నిర్మలమైన ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన ఇరాన్‌తో యుద్ధం మానుకోవాలని, అధికారం ఉన్నవారు శాంతి మార్గాన్ని ఎంచు కోవాలని ఎవరి పేరూ ప్రస్తావించకుండా హితవు చెప్పారు. ఆ మాటలు సాధారణ వ్యాఖ్యలు.. కానీ ట్రంప్ వాటిని తనకు వ్యతిరేకంగా తీసుకున్నారు. ఆ తర్వాత జరిగినదంతా .. పోప్‌ను “బలహీనుడు, దుర్బలుడు” అనడం, “ఇరాన్ దగ్గర అణుబాంబు ఉండటాన్ని సమర్థిస్తున్నారు” అని ఆరోపణలు చేయడం, చివరికి తనను తాను ఏసు క్రీస్తుగా (ఏఐ) చిత్రాలతో చిత్రీకరించుకోవడం.. ఇది ఒక మానసిక అస్థిరతకు నిదర్శనం కాదా?
ప్రతిదీ వివాదాస్పదమే..
ఇది కేవలం ఒక వ్యక్తి విమర్శ కాదు. ఇది ఒక పాఠం. ఒక దేశ అధ్యక్షుడు ఎలా ఉండకూడదు, ఒక నాయకుడు ఎలా ప్రవర్తించకూడదు, ఒక మనిషి ఎంతగా పతనం చెందగలడు అనేదానికి డొనాల్డ్ ట్రంప్ జీవితం ఒక కేస్ స్టడీ. ట్రంప్ జీవితంలోని ప్రతి అంశం.. ఆయన పెంపకం, వ్యాపార చరిత్ర, వ్యక్తిగత జీవితం, నైతిక విలువలు, రాజకీయ నిర్ణయాలు, అంతర్జాతీయ సంబంధాలు, మహిళల పట్ల వైఖరి, నోటి దురుసుతనం, చట్టపరమైన వివాదాలు ఇలా... ప్రతిదీ వివాదాస్పదమే.
పోప్‌పై దాడి.. బలహీనుడెవరు?
ట్రంప్ పోప్‌ను ‘బలహీనుడు’ అని విమర్శించారు. ఇది ఎంత హాస్యాస్పదమైన విమర్శ? పోప్ లియో తన జీవితంలో ఎన్నో ప్రాణాపాయాలను ఎదుర్కొన్నారు.. ఆయన యుద్ధ ప్రాంతాలను సందర్శించారు. ఆయన మాఫియా నుండి బెదిరింపులు అందుకున్నారు. ఆయన దేశాల అధినేతలతో గట్టిగా మాట్లాడతారు.. అలాంటి వ్యక్తి బలహీనుడు ఎలా అవుతాడు? ఒక వ్యక్తి తన చేతిలో అణ్వాయుధం లేకుండా, తన వెనుక సైన్యం లేకుండా, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలను నిలువరిస్తే, అతడు బల హీనుడా? లేదు, అతడు నిజమైన బలవంతుడు. ట్రంప్‌కు ఆ బలం ఎన్నడూ అర్థం కాదు.
చరిత్రలో అత్యంత చెడ్డ అధ్యక్షుడు..
ట్రంప్ పోప్ లియో-14 తో చేసిన వాగ్వాదం ఆయన సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. పోప్ ఒక శాంతి దూత. ఆయన ప్రేమను, సహనాన్ని, క్షమాపణను బోధిస్తారు. ట్రంప్ ఒక విభజనకారుడు. ఆయన ద్వేషాన్ని, అసూయను, ఆగ్రహాన్ని విత్తుతారు.. పోప్ తన వ్యాఖ్యలలో ట్రంప్ పేరును కూడా ప్రస్తావించలేదు. ట్రంప్ మాత్రం పోప్‌ను బహిరంగంగా అవమానించారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఒక ప్రపంచ విపత్తు.. అమెరికా చరిత్రలో ఇంత చెడ్డ ప్రవర్తన, ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న అధ్యక్షుడు మరొకరు లేరు.. ఆయన హుందాతనం లేని, నోటి దురుసుతనం ఎక్కువైన, అందరినీ తన మాటలతో, చేతులతో బాధపెట్టే ఒక వ్యక్తి.
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496






