మందుబాబులకు ‘కిక్కు’ దిగే షాకింగ్ న్యూస్.. ఇది తెలిస్తే ఇక మందు ముట్టరు

by  |
మందుబాబులకు ‘కిక్కు’ దిగే షాకింగ్ న్యూస్.. ఇది తెలిస్తే ఇక మందు ముట్టరు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వ ఖజానా నింపేందుకు కృషిచేస్తున్న మందుబాబులు.. ట్యాక్సుల రూపంలో వేల కోట్లు సర్కార్‌కు చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం కేవలం మద్యం అమ్మకాలపైనే దృష్టిసారిస్తూ ఎక్కడికక్కడ వైన్స్ షాపులను ఏర్పాటుచేస్తూ మందుబాబులకు అండగా నిలుస్తోందంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. మద్యం దుకాణాలపై ప్రభుత్వానికి ఎందుకింత ఇంట్రెస్ట్ అని ఆరా తీయగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం, రిజిస్ట్రేషన్లపై అధికంగా ఆదాయం చేకూరుతుంది. అయితే, మద్యం ద్వారా ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ వస్తుందో మీకు తెలుసా..? మద్యం ప్రియులు ఇష్టంగా తాగే బీర్లు, విస్కీలపై రాష్ట్రానికి వచ్చే ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి.

కింగ్ ఫిషర్ బీరును ప్రస్తుతం వైన్సులో రూ.140కి అమ్ముతున్నారు. అయితే, ఇది కేవలం రూ.22.50కి తయారవుతుందన్న విషయం మీకు తెలుసా?. ఈ బీరుపై ట్రాన్స్‌పోర్టు ఖర్చు, దళారీ కమీషన్‌తో కలిపినా రూ.41 మాత్రమే అవుతోంది. కానీ, ప్రభుత్వం రూ.99 ట్యాక్స్‌ను వసూలు చేసి రూ.140 MRPకి అమ్మకం చేస్తోంది. ఇలా బడ్వైజర్ బీరుపై(రూ.200) ప్రభుత్వ ట్యాక్సు రూ.140, రాయల్ స్టాగ్ విస్కీ ఫుల్ బాటల్(రూ.800)పై ట్యాక్స్ రూ.569, ఆఫీసర్స్ ఛాయిస్ ఫుల్ బాటల్(రూ.530)పై ట్యాక్స్ రూ.397 వసూలు చేస్తోంది. ఇలా ట్యాక్సుల రూపంలో దండిగా వస్తుండటంతోనే ప్రభుత్వం మద్యం అమ్మకాలపైనే దృష్టిసారిస్తోందంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.

మతతత్వం రెచ్చగొట్టడం కాదు.. రైతు సమస్యలు తీర్చండి : కేసీఆర్ ఫైర్


Next Story

Most Viewed