మతతత్వం రెచ్చగొట్టడం కాదు.. రైతు సమస్యలు తీర్చండి : కేసీఆర్ ఫైర్

by  |
మతతత్వం రెచ్చగొట్టడం కాదు.. రైతు సమస్యలు తీర్చండి : కేసీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొంటుందా.? కొనదా.? చెప్పకుండా వంకర టింకర సమాధానాలు చెబుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యంపై కేంద్రం చూపుతున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహా ధర్నా ముగింపులో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతు చట్టాలు రద్దు చేయండి అని ఢిల్లీలో అన్నదాతలు ఏడాదికి పైగా ధర్నాలు చేస్తుంటే వాస్తవాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు మాటలు మాట్లాడుతోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రస్తుత రైతుల దుస్థితికి కారణం దేశంలో పాలించిన అన్ని పార్టీలేనని అన్నారు.

పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కన్నా దీనస్థితిలో భారతదేశం ఉందని కేసీఆర్ ఆరోపించారు. వానాకాలం పంట కొనేందుకే కేంద్రానికి దిక్కులేదు, ఇంకా యాసంగి పంట ఇంకెక్కడి నుంచి కొంటుందని విమర్శించారు. కేంద్రం కొనకపోతే రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతోనే యాసంగిలో వడ్లు వేయవద్దని పిలుపునిచ్చామన్నారు. రాష్ట్రం కోరిన అనేక సమస్యలు పెండింగ్‌లో పెట్టారన్నారు. సరిహద్దుల్లో మీరు ఆడుతున్న నాటకాలు తెలుసని, సమస్యలను పక్కనపెట్టి మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

మందుబాబులకు ‘కిక్కు’ దిగే షాకింగ్ న్యూస్.. ఇది తెలిస్తే ఇక మందు ముట్టరు



Next Story

Most Viewed