తిరుమల అప్ డేట్: శ్రీవారి సర్వదర్శనం కోసం 8 కంపార్టుమెంట్లలో భక్తులు

by Malleboina Mahesh |   (  Updated:2026-04-20 16:32:34  IST  )

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 76,406 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. నేడు టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

తిరుమల అప్ డేట్: శ్రీవారి సర్వదర్శనం కోసం 8 కంపార్టుమెంట్లలో భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ (Crowd of devotees) సాధారణంగా కొనసాగుతోంది. నిన్న (ఆదివారం) సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే మొత్తం 76,406 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 28,463 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More.. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం

Next Story