- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చతుర్ గ్రహి యోగం.. ఈ మూడు రాశులవారికి జరగబోయేది ఇదే..
చతుర్ గ్రహి యోగం.. బుధగ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో ఇది ఏర్పడింది.

దిశ, వెబ్‌డెస్క్: చతుర్ గ్రహి యోగం.. బుధగ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో ఇది ఏర్పడింది. ఈ రాశిలో ఇప్పటికే మూడు ప్రధాన గ్రహాలు సంచరిస్తున్నాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు.. ఇప్పుడు బుధుడు కూడా సంచరిస్తుండటంతో వృశ్చికరాశిలో చతుర్ గ్రహి యోగం ఏర్పడింది. ఈ రాశిలో కుజుడు డిసెంబర్ 7 వరకు, సూర్యుడు డిసెంబర్ 16 వరకు, శుక్రుడు డిసెంబర్ 20 వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు. ఈ చతుర్ గ్రహి యోగం.. మూడు రాశుల్లో జన్మించినవారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని జ్యోతిష్కులు చెప్తున్నారు.
మేషం
మేష రాశివారికి చతుర్ గ్రహి యోగం వల్ల కెరీర్, ఆర్థిక బలం పుంజుకోనున్నాయి. ఈ సమయంలో మీ కృషికి ఫలితం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీ నిర్ణయం మీరే తీసుకునే సామర్థ్యాలు బలపడుతాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. సంపాదనకు కొత్త అవకాశాలు తెరచుకుంటాయి.
వృశ్చిక రాశి
ఈ రాశిలోనే చతుర్ గ్రహి యోగం ఏర్పడుతుండటంతో.. ఈ రాశి వారిపై గొప్ప ప్రభావాన్ని చూపుతోంది. సమాజంలో, పనిలో ఖ్యాతి పెరుగుతుంది. చేసే ప్రతి పనిని అందరూ మెచ్చుకుంటారు. సమాజంలో పేరు బలపడుతుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాల్లో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ యోగం గృహాన్ని బలోపేతం చేస్తుంది. వృత్తిపరమైన పురోగతి, కొత్త అవకాశాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు జీతం, ఆదాయం పెరుగుతాయి. వ్యాపార ఒప్పందాలు విజయవంతమవుతాయి. ఇల్లు, కారు లేదా విలువైన వస్తువులని కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో పెట్టుబడులు పెడతారు.
Read More..
2026 మొదటిరోజున బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి కటాక్షం






