- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2026 మొదటిరోజున బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి కటాక్షం
బ్రహ్మముహూర్తాన్ని రోజులో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: బ్రహ్మముహూర్తాన్ని రోజులో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో మేల్కొని దైవనామ స్మరణ చేస్తే.. జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారని వేదాలు చెబుతున్నాయి. వారి ఇళ్లలో ఆహారం, డబ్బుకి కొరత ఉండదు. 2026 నూతన సంవత్సరంలో మొదటి రోజున బ్రహ్మముహూర్తంలో కొన్ని పనులు చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు.
దేవ, దేవతలు మన అరచేతుల్లో ఉంటారని చెప్తారు. నిద్రలేవగానే అరచేతుల్ని చూస్తూ.. "కరాగ్రే వసతి లక్ష్మీః, కర్ మధ్యే సరస్వతి, కరములే తు గోవిందః, ప్రభాతే కర దర్శనం" అనే మంత్రాన్ని జపించాలి. బ్రహ్మ ముహూర్తంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెప్తున్నారు.
అలాగే తులసి ఆకులతో గంగాజలాన్ని ఇంటిలో ప్రతి మూలలో చల్లుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నాశనమై. దుఃఖం, పేదరికం వంటివి తొలగుతాయి. పాజిటివ్ ఎనర్జీ పెరిగి.. చేపట్టే ప్రతి పనిలోనూ అడ్డంకులు తొలగుతాయి.
2026 మొదటిరోజు బ్రహ్మముహూర్తంలో తులసి దగ్గర దీపం పెట్టాలి. తులసికి నీరు, పవిత్ర దారాన్ని సమర్పించాలి. తులసిదేవి ముందు కూర్చుని లక్ష్మీదేవికి అంకితం చేసిన మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది.
Read More..






