- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దానం నాగేందర్‌కు ఆరు నెలలు జైలుశిక్ష
<p>దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలుశిక్ష పడింది. ఆయనకు ఆరు నెలలు జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2013లో జరిగిన ఒక ఘర్షణ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ, ఎమ్మెల్యే స్పెషల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ ఈ తీర్పునిచ్చారు. 2013లో జరిగిన ఒక ఘర్షణ కేసులో IPC 323,506 341 సెక్షన్ల కింద బంజారా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలుశిక్ష పడింది. ఆయనకు ఆరు నెలలు జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2013లో జరిగిన ఒక ఘర్షణ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ, ఎమ్మెల్యే స్పెషల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ ఈ తీర్పునిచ్చారు.
2013లో జరిగిన ఒక ఘర్షణ కేసులో IPC 323,506 341 సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు అప్పట్లో దానం నాగేందర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా.. నేరం రుజువు కావడంతో తాజాగా దానం నాగేందర్‌కు కోర్టు శిక్ష విధించింది. రూ. 1000 జరిమానాతో పాటు ఆరు నెలల శిక్ష విధించింది. అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
చివరి శ్వాస వరకు టీఆర్‌ఎస్‌లోనే: దానం నాగేందర్

Next Story






