కుటుంబాన్ని బ‌లి తీసుకున్న భార్య ఎఫైర్.. భర్త చేసిన పనికి వరల్డ్ వైడ్ ట్రెండింగ్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-14 04:59:51  IST  )

బ్రెజిల్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రెజిల్‌లోని ఇటుంబియారాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కుటుంబాన్ని బ‌లి తీసుకున్న భార్య ఎఫైర్.. భర్త చేసిన పనికి వరల్డ్ వైడ్ ట్రెండింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: బ్రెజిల్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రెజిల్‌లోని ఇటుంబియారాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుంబియారా ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఈ క్రమంలో భార్య చేసిన పనికి అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానం వచ్చిన వెంటనే ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు.

ఆమెను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను సైతం నియమించుకున్నాడు. భార్య తన ప్రియుడిని కలిసిన సందర్భంలో డిటెక్టివ్ సహాయంతో పట్టుకోవడమే కాకుండా వీడియోలు కూడా తీశాడు. అక్రమసంబంధం నిజమేనని పూర్తిగా నిర్దారించుకున్న తరవాత తీవ్రమనస్థాపంతో తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రస్తుతం వీరి కుటుంబం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్యా భర్తల జంట ఎంతో అందంగా ఉండటం.. పిల్లలు సైతం క్యూట్‌గా ఉండటంతో వీరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా భార్య వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆ మహిళ చేసిన పనిపై ఫైర్ అవుతున్నారు. మహిళ చేసిన తప్పు వల్లే పచ్చని కుటుంబం నాశనం అయ్యిందని కామెంట్ చేస్తున్నారు. తండ్రి సైతం క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీశాడని, వాళ్లు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది.

స్కూల్‌లో దారుణం.. విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్

ఢిల్లీ యూనివర్సిటీ ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు?

Next Story