- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనీమూన్ మర్డర్ 2.O.. పెళ్లైన మూడు నెలలకే!
అప్పట్లో పెళ్లైన వెంటనే భర్తను హనీమూన్ తీసుకువెళ్లి నవ వధువు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు అలాంటి హత్యే మరొకటి జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: అప్పట్లో పెళ్లైన వెంటనే భర్తను హనీమూన్ తీసుకువెళ్లి నవ వధువు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు అలాంటి హత్యే మరొకటి జరిగింది. పెళ్లైన మూడు నెలలకే భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం దొరకకుండా ఉండేందుకు పెద్ద స్కెచ్ వేసినా అది విఫలమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన ఆశిష్, అంజు భార్యా భర్తలు. వీరికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. గత శుక్రవారం ఆశిష్ తన భార్య అంజుతో కలిసి వాకింగ్ వెళ్లాడు.
ఇద్దరూ వాకింగ్ చేస్తుండగా భార్య ఆమె, ప్రియుడు మరో ఇద్దరు ఆశిష్ ను హత్య చేశారు. అనంతరం ప్రియుడు, మరో ఇద్దరు బంగారం తీసుకుని పారిపోగా అంజు అక్కడే ఉండిపోయింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆశిష్ మరణించడంతో భార్య ఇచ్చిన వాంగ్మూలం మేరకు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను విచారించగా ఒక గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని చెప్పింది.
కిందపడిపోయిన తరవాత బంగారు ఆభరణాలు దోచుకున్నారని చెప్పింది. కానీ పోలీసులకు అనుమానం రావడంతో తమ స్టైల్ లో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. అంజు తన ప్రియుడు సంజు, మరో ఇద్దరితో కలిసి భర్తను హత్య చేసినట్టు తేలింది. దీంతో తామే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు భార్య పోలీసుల ముందు అంగీకరించింది. అంతే కాకుండా హత్య చేసినట్టు బయటపడకుండా ఉండేందుకు తానే భర్త చెవిపోగులను ప్రియుడికి ఇచ్చినట్టు చెప్పింది. ఈ ఘటన ఇప్పుడు రాజస్థాన్ లో సంచలనంగా మారగా దీనిని మేఘాలయ తరహా మర్డర్ కేసు.. హనీమూన్ 2.o అంటూ చెబుతున్నారు.






