రిటైర్డ్ డీఎస్‌పీని కట్టేసి కొట్టిన భార్యాకొడుకులు.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-25 13:48:09  IST  )

మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చందవాని గ్రామంలో రిటైర్డ్ డీఎస్‌పీ ప్రతిపాల్ సింగ్ యాదవ్‌ను కట్టేసి కొట్టారు భార్యాకొడుకులు. అతని ఛాతీపై కూర్చుని ఒకరు బాదుతుంటే..

రిటైర్డ్ డీఎస్‌పీని కట్టేసి కొట్టిన భార్యాకొడుకులు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చందవాని గ్రామంలో రిటైర్డ్ డీఎస్‌పీ ప్రతిపాల్ సింగ్ యాదవ్‌ను కట్టేసి కొట్టారు భార్యాకొడుకులు. అతని ఛాతీపై కూర్చుని ఒకరు బాదుతుంటే.. మరొకరు కాళ్లు కదలకుండా పట్టుకోగా.. భార్య చూస్తూ ఉండిపోయింది. మార్చి నెలలో రిటైరైన డీఎస్‌పీ.. తమకు డబ్బులు ఇవ్వడం లేదనే దాడికి పాల్పడ్డారు. ఏటీఎం కార్డు, ఫోన్ లాక్కుని.. బలవంతంగా వారి దగ్గరకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు జోక్యం చేసుకుని కాపాడారు. కాగా దాదాపు 15ఏళ్లుగా ప్రతిపాల్ సింగ్ యాదవ్ కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

Read More..

suicide : సారీ నాన్న అంటూ .. యువతి సూసైడ్ నోట్


Next Story