- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
suicide : సారీ నాన్న అంటూ .. యువతి సూసైడ్ నోట్
సారీ నాన్న.. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించావు.. నాలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదు అంటూ.

దిశ డైనమిక్ బ్యూరో : సారీ నాన్న.. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించావు.. నాలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదు అంటూ.. ఆవేదనతో యువతి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖలో ఖమ్మం జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామానికి చెందిన రమ్యను ప్రేమ పేరుతో వివాహితుడైన నరేష్ విశాఖపట్నం తీసుకువెళ్లాడు. 15 రోజుల తర్వాత రమ్యను విశాఖలో లాడ్జ్‌లో వదిలేసి ఇంటికెళ్లిపోయాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో యువతి మనస్తాపం చెందింది. లాడ్జ్‌లోనే ఉరివేసుకుని రమ్య ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతి రాసిన సూసైడ్ లేఖ ఎలా ఉంది.. ‘నన్ను క్షమించండి.. నా చావుకు కారణం నన్ను ఇంత దూరం తీసుకువచ్చి నమ్మించి మోసం చేసి వెళ్లిపోయిన నరేష్. నా తల్లిదండ్రులకు ఇక్కడి నా చావుకు ఎటువంటి సంబంధం లేదు. నాన్న.. సారీ.. వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. తమ్ముడు జాగ్రత్త. నా కోసం ఆలోచించకండి.. లవ్ యూ నాన్న.. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించావు... ’ అంటూ ఆ లేఖలో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More..
జుట్టు పట్టుకుని ఈడ్చి.. ఒంటికి నిప్పంటించి దారుణం.. వైరల్ అవుతోన్న నిక్కీ హత్య వీడియో






