- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జుట్టు పట్టుకుని ఈడ్చి.. ఒంటికి నిప్పంటించి దారుణం.. వైరల్ అవుతోన్న నిక్కీ హత్య వీడియో
గ్రేటర్ నోయిడాలో అదనపు కట్న వేధింపులకు బలైన వివాహిత నిక్కీ భాటి (28) కేసులో (Nikki Bhati Murder Case) సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ నోయిడాలో అదనపు కట్న వేధింపులకు బలైన వివాహిత నిక్కీ భాటి (28) కేసులో (Nikki Bhati Murder Case) సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అదనపు కట్నం కోసం నిక్కీని అత్తింటివారు వేధించిన తీరును ఆమె సోదరి కాంచన్ బయటపెట్టింది. నిక్కీ, ఆమె సోదరి కాంచన్ లను తల్లిదండ్రులు ఒకే కుటుంబానికి ఇచ్చి 2016లో వివాహాలు జరిపించారు. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు సమర్పించినా.. నాటి నుంచి ఇద్దరు కోడళ్లను అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారని కాంచన్ తెలిపింది. ఇద్దరు అన్నదమ్ములకు అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయని, వారిని ఈ విషయంలో నిలదీయగా పలుమార్లు గొడవలు కూడా జరిగాయని కాంచన్ వెల్లడించింది.
నిక్కీ, తాను కలిసి బ్యూటీ పార్లర్ ను నడిపేవారమని, దానిని కూడా మూసివేయించారని పోలీసులకు తెలిపింది. తిరిగి బ్యూటీపార్లర్ ను ప్రారంభించాలని గురువారం (ఆగస్టు 21) నిక్కీ, కాంచన్ ప్లాన్ చేసుకుంటండగా నిక్కీ భర్త విపిన్, అత్తమామలు దానిని వ్యతిరేకించారని, ఇలాంటివి తమ కుటుంబం ఇష్టపడదని చెప్పడంతో గొడవ జరిగిందని చెప్పుకొచ్చింది. అనంతరం ఆమెపై దాడి చేసి, ఒంటికి నిప్పంటించినట్లు వివరించింది. కాగా.. తమ బ్యూటీ పార్లర్ ను ప్రమోట్ చేసేందుకు మేక్ ఓవర్ బై కాంచన్ (Makeover by Kanchan) అనే యూట్యూబ్, ఇన్ స్టా ఛానల్స్ ను కూడా రన్ చేశారు. ఇన్ స్టాలో 54,500 మంది, కాంచన్ పర్సనల్ అకౌంట్లో 22 వేలు, నిక్కీ పర్సనల్ అకౌంట్ కు 1147 మంది ఫాలోవర్స్ ఉన్నారు. తమ సంపాదనను కూడా అత్తింటివారే తీసుకునేవారని కాంచన్ వెల్లడించింది.
నిక్కీ హత్యకేసు దేశంలో పెను సంచలనం సృష్టించింది. ఆ దుర్మార్గుడితో పాటు అత్తమామలను ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిక్కీ హత్యకు సంబంధించి కాంచన్ కొన్ని వీడియో క్లిప్పుల్ని సోషల్ మీడియాలో (Nikki Murder Video) షేర్ చేయగా.. ఆ వీడియోలో నిక్కీపై భర్త, అత్త దయా తీవ్రంగా దాడిచేసినట్లు కనిపిస్తోంది. తన తల్లిపై ఏదో పోసి, ఆమెను చెంపదెబ్బ కొట్టి, కాగితంతో నిప్పంటించారని నిక్కీ కొడుకు మీడియాకు తెలిపాడు. కాంచన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విపిన్, బావమరిది రోహిత్ భాటి, అత్త దయా, మామ సత్వీర్ లపై బీఎన్ఎస్ సెక్షన్ 103, సెక్షన్ 115 (2), సెక్షన్ 61 (2) కింద కేసు నమోదు చేసి.. విపిన్, అతని తల్లి, సోదరుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు. కాగా.. విపిన్ సోషల్ మీడియా అకౌంట్లో తానొక అడ్వొకేట్ గా పేర్కొన్నాడు. న్యాయవృత్తిలో ఉండి ఇలాంటి పనులేనా చేసేది అని.. యావత్ దేశం అతనిని ఛీ కొడుతోంది. వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read More..
నిక్కీ కేసు తప్పుదారి పడుతోందా? నిప్పంటించింది భర్త కాదా? సీసీటీవీ ఫుటేజీ ఏం చెప్తుంది?






