నిక్కీ కేసు తప్పుదారి పడుతోందా? నిప్పంటించింది భర్త కాదా? సీసీటీవీ ఫుటేజీ ఏం చెప్తుంది?

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-25 14:14:24  IST  )

గ్రేటర్ నోయిడా నిక్కీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిక్కీ భాటిని ఆమె భర్త విపిన్ భాటి పెట్రోల్ పోసి నిప్పంటించాడని న్యూస్ వైరల్ కావడం.. తన కళ్ల ముందే తండ్రి తల్లిని నిప్పంటించాడని కొడుకు చెప్పడంతో యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా లక్షలకు లక్షలు

నిక్కీ కేసు తప్పుదారి పడుతోందా? నిప్పంటించింది భర్త కాదా? సీసీటీవీ ఫుటేజీ ఏం చెప్తుంది?
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ నోయిడా నిక్కీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిక్కీ భాటిని ఆమె భర్త విపిన్ భాటి పెట్రోల్ పోసి నిప్పంటించాడని న్యూస్ వైరల్ కావడం.. తన కళ్ల ముందే తండ్రి తల్లిని నిప్పంటించాడని కొడుకు చెప్పడంతో యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా లక్షలకు లక్షలు, ఖరీదైన వాహనాలు తీసుకున్నాక కూడా అదనంగా రూ. 36లక్షల కోసమే ఇదంతా చేశాడని అనుమానం ఉండటంతో మరింత కోపాన్ని తెప్పిస్తోంది. వెంటనే అతన్ని శిక్షించాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. కానీ ఇరుగు పొరుగు వారు మాత్రం నిందితుడు విపిన్ నిర్దోషి అని సపోర్ట్ ఇస్తున్నారు. కేసును ఒక వైపు నుంచి మాత్రమే చూడకుండా.. రెండు వైపులా ఆరా తీయాలని సూచిస్తున్నారు.

మా సీసీటీవీ ఫుటేజీ చూడండి..

‘విపిన్ కుటుంబం చాలా మంచిది. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు చాలా సౌమ్యులు. ఇక్కడ మంచి గౌరవమర్యాదలతో బతికారు. కోడళ్లపై ఇలాంటి పనికి సాహసించరు. ఘటన జరిగిన రోజు విపిన్ కిందే నిలబడి ఉన్నాడు. నిక్కీ నిప్పంటించుకుందని తెలియగానే.. పరుగెత్తుకుని పైకి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మా దగ్గర ఉంది’ అని నిందితునికి మద్దతు ఇస్తున్నారు. విపిన్‌కు న్యాయం జరగాలని కోరుతున్నారు.

రెండేళ్ల క్రితం వీడియోనా??

విపిన్.. నిక్కీని కొట్టిన వీడియో రెండేళ్ల కిందటిదని చెప్తున్నారు స్థానికులు. భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమని.. సోషల్ మీడియా, రీల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని నిక్కీకి సూచించేవాడని తెలుస్తోంది. బ్యూటీపార్లర్‌ నడిపించడం, అలా తిరగడం కూడా అతనికి నచ్చలేదని ఈ క్రమంలోనే వార్నింగ్ ఇచ్చి ఉంటాడని సమాచారం. అయితే నిక్కీ అక్క ఈ కేసును కావాలనే తప్పు పట్టిస్తుందనే వాదన ఉంది. నిక్కీ స్వయంగా నిప్పంటించుకున్నప్పుడు ఆపకుండా.. వీడియో తీస్తూ ఉండిపోవడం ఎందుకని..పైగా ఇందులో ‘అరే బాబు.. నువ్వు ఏం చేశావ్’ అనే వాయిస్ వినిపిస్తుందని.. అంటే అక్కడ విపిన్ లేడనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. విపిన్‌కు తాగే అలవాటు ఉంది కానీ ఇతరులతో ఇల్లీగల్ ఎఫైర్స్ లేవని.. ఇదంతా కల్పితమని అంటున్నారు. నిక్కీ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తేలాలని.. విపిన్‌ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read.

మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన లెక్చరర్..కేసు నమోదు

జుట్టు పట్టుకుని ఈడ్చి.. ఒంటికి నిప్పంటించి దారుణం.. వైరల్ అవుతోన్న నిక్కీ హత్య వీడియో

Next Story