ఆరుగురితో భార్య ఎఫైర్.. భర్తను లేపేద్దామని ప్లాన్.. ఆడియో రికార్డింగ్‌తో భర్త సేఫ్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-26 09:51:08  IST  )

ఈ మధ్య ఇల్లీగల్ ఎఫైర్స్ కామన్ అయిపోయాయి. భార్యను భర్త చంపడం లేదంటే భర్తను భార్య లేపేయడం చూస్తూనే ఉన్నాం. రోజుకో కొత్త కేసు వెలుగులోకి వస్తూనే ఉంది. ఇక తాజాగా ఓ వైఫ్.. ఆరుగురితో ఎఫైర్ పెట్టుకుంది. వాళ్ల అందరితో కలిసి కట్టుకున్న

ఆరుగురితో భార్య ఎఫైర్.. భర్తను లేపేద్దామని ప్లాన్.. ఆడియో రికార్డింగ్‌తో భర్త సేఫ్..
X

దిశ, వెబ్‌సైట్ : ఈ మధ్య ఇల్లీగల్ ఎఫైర్స్ కామన్ అయిపోయాయి. భార్యను భర్త చంపడం లేదంటే భర్తను భార్య లేపేయడం చూస్తూనే ఉన్నాం. రోజుకో కొత్త కేసు వెలుగులోకి వస్తూనే ఉంది. ఇక తాజాగా ఓ వైఫ్.. ఆరుగురితో ఎఫైర్ పెట్టుకుంది. వాళ్ల అందరితో కలిసి కట్టుకున్న మొగుడిని లేపేసేందుకు ప్లాన్ చేసింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానంతో ముందుగానే భర్త ఆమె ఫోన్‌లో ఆడియో రికార్డింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేశాడు. వాటిని విని తనను చంపేందుకు ప్లాన్ చేసిందని తెలుసుకుని షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి.. ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఆమెతోపాటు ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

ఇక ఈ విషయం వైరల్ కాగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ఆయన ప్రాణానికి గ్యారెంటీ ఉందో లేదో అని కామెంట్స్ చేస్తున్నారు. విడాకులు అనే ఆప్షన్ ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని కొందరు అంటుంటే.. నిజంగా అతనికి చాలా ధైర్యం ఉంది.. లేదంటే ఫోన్ లాక్ చేసి ఓ యాప్ సీక్రెట్‌గా ఇన్‌స్టాల్ చేయడం గ్రేట్ అంటున్నారు మరికొందరు. టెక్నాలజీ వల్ల ఒక మనిషి బతికాడని ఇంకొందరు రిప్లయ్ ఇస్తున్నారు.

లింక్

వామ్మో ఏందీ అరాచకం..! న్యూడ్ వీడియోలతో దంపతుల యాపారం

Next Story