- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో ఏందీ అరాచకం..! న్యూడ్ వీడియోలతో దంపతుల యాపారం
డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా తయారైంది నేటి సమాజం.

దిశ, వెబ్‌డెస్క్: డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా తయారైంది నేటి సమాజం. కష్టపడకుండా.. కాసులొస్తున్నాయంటే ఎంతకైనా తెగించేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాగ్ అంబర్‌పేట్ (Bhag Amberpet) పరిధిలోని మల్లికార్జున నగర్ (Mallikarjuna Nagar)లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, వారు ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు అప్‌లోడ్, లైవ్ చాటింగ్ చేస్తే రూ.లక్షల్లో సంపాదించొచ్చని ఆలోచించారు. అనుకుందే తడువుగా.. హై రెజల్యూషన్ కెమెరాలతో పాటు ఇతర సామగ్రి కొనుగోలు చేసి ఏకంగా ఇంటి టెర్రస్‌పైనే పరదాలు కట్టి పెద్ద సెటప్ వేశారు.
నిత్యం కెమెరా ఎదుట ఆన్‌లైన్‌లో శృంగారం చేయడం మొదలు పెట్టారు. అనంతరం ఆ ఫుటేజీని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే.. సదరు వెబ్‌సైట్ నుంచి వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమయ్యేది. ఇలా వారి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఈ క్రమంలోనే వస్తున్న డబ్బు తక్కువైందని అనుకున్నారో ఏమో ఏకంగా ఆన్‌లైన్‌లో లైవ్ సెక్స్ మొదలెట్టేశారు. యువతను టార్గెట్‌గా చేసుకుని వారి శృంగారం చేస్తుండగా నేరుగా చూస్తారా అని గేలం వేసేవారు. అనంతరం వారి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు చార్జ్ చేసేవారు. ఈ విషయం కాస్త ఓ కానిస్టేబుల్ చెవిన పడింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ (East Zone Task Force) పోలీసులు ఆ దంపతుల ఇంటిపై దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. లైవ్ సెక్స్ చాట్‌కు ఉపయోగించిన కెమెరాలు, ఇతర స్వాధీనం చేసుకుని ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి నిందితులను అంబర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.
ఆరుగురితో భార్య ఎఫైర్.. భర్తను లేపేద్దామని ప్లాన్.. ఆడియో రికార్డింగ్‌తో భర్త సేఫ్..






