- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ సంబంధమా? అమావాస్య నాడు బలిచ్చారా? బాలిక హత్య కేసులో వీడని మిస్టరీ
విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంటో మైనర్ బాలిక గురువారం దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు బాలికను ముక్కలు ముక్కలుగా చేసి కాలువలో పడేశారు. ఘటనాస్థలంలో శరీర భాగాలు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంటో మైనర్ బాలిక గురువారం దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు బాలికను ముక్కలు ముక్కలుగా చేసి కాలువలో పడేశారు. ఘటనాస్థలంలో శరీర భాగాలు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అయితే 24 గంటలు గడిచినా కేసులో ఎలాంటి ఆధారాలు లభ్యం అవ్వలేదు. అంతే కాకుండా బాలిక తల భాగం కూడా దొరకలేదు. డ్రైనేజీలో కనిపించిన ఇతర శరీర భాగాలను సేకరించిన పోలీసులు విశాఖ కేజీహెచ్ ల్యాబ్ కు తరలించారు.
తాటిచెట్లపాలెం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో గర్భిణీ స్త్రీలు, ప్రసవించిన మహిళల వివరాలను ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సేకరిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం, అసలు పాప ఎవరో తెలయకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది. అక్రమ సంబంధం నేపథ్యంలో పుట్టిన పాపను హత్య చేసి కాలువలో పడేశారా? లేదంటే అమావాస్య కావడంతో క్షుద్రపూజలు చేసి హత్య చేసి నాళాలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసును త్వరగా చేధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read More..






