అమావాస్య రాత్రి.. రోడ్డు పై క్షుద్ర పూజల కలకలం

by Batti.Sumithra |

క్షుద్రపూజలు చేసిన ఘటన మంథనిలో కలకలం రేపింది.

అమావాస్య రాత్రి..  రోడ్డు పై క్షుద్ర పూజల కలకలం
X

దిశ, మంథని : క్షుద్రపూజలు చేసిన ఘటన మంథనిలో కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని మంథని నుండి పెద్దపల్లి వెళ్లే ప్రధాన రహదారి పై కూచిరాజ్‌పల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం క్షుద్రపూజలు చేసిన ఘటన అటువైపు నుంచి వెళ్లుతున్న వాహనదారులు, వాకర్స్, స్థానిక ప్రజలను కలకలం రేపాయి. రోడ్డు మీద గుమ్మడి కాయలు, నిమ్మకాయలు, కుంకుమ, భారీగా క్షుద్ర పూజల సామాగ్రి దర్శనమిచ్చాయి.

దీంతో ఒక్కసారిగా స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురువారం అమావాస్య కావడంతో గుర్తుతెలియని వ్యక్తులు కూచిరాజ్‌పల్లి లక్కేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద అర్ధరాత్రి సమయంలో ఇలాంటి పనికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. నేటి సాంకేతిక యుగంలో కూడా ఇలాంటి మూడనమ్మకాలను కొందరు పాటించడాన్ని ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు ఇంకా పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొందరు మూఢనమ్మకాలను పాటిస్తున్నారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

Next Story