- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: కాపురంలో చిచ్చుపెట్టిన ‘నైటీ’.. ఏకంగా భార్యకు నిప్పంటించిన భర్త
కర్ణాటకలోని బెళగావిలో దారుణం చోటుచేసుకుంది. భార్య నైటీ ధరిస్తోందనే కోపంతో భర్త ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

దిశ, వెబ్‌డెస్క్: వస్త్రాధారణ విషయంలో తలెత్తిన పంచాయితీ ఓ మహిళను చావు అంచుల దాకా తీసుకెళ్లింది. భార్య తాను చెప్పినట్లుగా చీర కట్టుకోకుండా నైటీ ధరిస్తోందనే చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన ఓ భర్త.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన కర్ణాటక (Karnataka)లోని బెళగావి (Belagavi) జిల్లాలో వెలుగుచూసింది వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజీ పాటిల్ (29), మంజులా పాటిల్ (27) దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కృష్ణాజీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మంజుల ఇంట్లో నైటీలు ధరించడం కృష్ణాజీకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడూ చీరలే కట్టుకోవాలని ఆమెతో తరచూ గొడవ పడేవాడు. భర్త మాటను కాదని మంజుల నైటీ ధరించడంతో నిన్న వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
రాక్షసుడిలా మారిన భర్త..
అయితే, భార్య తన మాట వినడం లేదని ఆగ్రహంతో రగిపోయిన కృష్ణాజీ, భార్య మంజులపై ఏకంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె హాహాకారాలు విన్న స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మంజుల 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడైన కృష్ణాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. భార్య, తల్లిని చంపి బిడ్డలతో సహా తండ్రి ఆత్మహత్య






