- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. భార్య, తల్లిని చంపి బిడ్డలతో సహా తండ్రి ఆత్మహత్య
తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో మోహన్ అనే వ్యక్తి తన భార్య, తల్లిని హత్య చేసి, ఇద్దరు బిడ్డలతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం తీవ్ర కలకలం గా మారింది. నారాయణవనం మండలం వెంకటకృష్ణాపురం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తండ్రి మోహన్ అనే వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మోహన్ తన భార్య హరిత (35), తల్లి చంద్రకళ (60)లను ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు చిన్నారులను తీసుకుని గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి, వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనలో తండ్రి మోహన్‌తో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిత్యం ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోహన్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






