ఎక్లాస్‌ఖాన్‌పేట్‌లో పరిస్థితి ఉద్రిక్తం.. బాహాబాహీకి దిగిన MLA, MLC వర్గీయులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-11 03:43:09  IST  )

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు బాహాబాహీకి దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట్ (Aclasskhanpet) గ్రామంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

ఎక్లాస్‌ఖాన్‌పేట్‌లో పరిస్థితి ఉద్రిక్తం.. బాహాబాహీకి దిగిన MLA, MLC వర్గీయులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు బాహాబాహీకి దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట్ (Aclasskhanpet) గ్రామంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ (Anjaiah Yadav) స్వగ్రామం అయిన ఎక్లాస్‌ఖాన్‌పేట్‌లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి (Naveen Kumar Reddy) తన మద్దతుదారులను వార్డు సభ్యులుగా నిలబెట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ అనుచరులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్సీ అనుచరుల కారును ధ్వంసం పూర్తిగా ధ్వజమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్సీ అనుచరులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి.

Read More..

పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. కొర్లపహాడ్‌లో కాంగ్రెస్, BRS శ్రేణుల తోపులాట

Next Story