- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాలర్ల ఆశలు ఆవిరై.. ఉద్యోగం రాక అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
ఏపీలోని కర్నూలుకు చెందిన ఇరగనబోయిన చందు అనే యువకుడు ఉన్నతచదువుల కోసం అమెరికా వెళ్లి షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. డబ్బుల కోసం కుటుంబ సభ్యులమీద ఆధారపడాల్సివస్తుందని ఆవేదన చెంది ఏప్రిల్ 28న తన అపార్ట్ మెంట్ గదిలో పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: విలాసవంతమైన జీవితం.. డాలర్లలో సంపాదన కోసం చాలా మంది యువతీయువకులు విదేశాలకు వెళుతున్నారు. అలా వెళ్లిన వాళ్లు లక్షలు ఖర్చు చేసి మాస్టర్స్ చేస్తే ఉద్యోగాలు మాత్రం కొందరికే వస్తున్నాయి. దీంతో ఉద్యోగాలు రానివాళ్లు తీవ్ర నిరాశతో వెనక్కి తిరిగివస్తున్నారు. మరికొందరు పర్మినెంట్ ఉద్యోగాలు దొరక్క పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ చేసిన అప్పులు తీరుస్తూ అక్కడే ఉండిపోతున్నారు. ఇక తాజాగా జరిగిన ఓ ఘటన ఉద్యోగం కోసం విదేశాలకు వెళితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిపేలా ఉంది.
ఏపీలోని కర్నూలుకు చెందిన ఇరగనబోయిన చందు అనే యువకుడు ఉన్నతచదువుల కోసం అమెరికా వెళ్లి షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం రాకపోవడంతో ఆందోళన చెందాడు. ఈ క్రమంలో డబ్బుల కోసం కుటుంబ సభ్యులమీద ఆధారపడాల్సివస్తుందని ఆవేదన చెంది ఏప్రిల్ 28న తన అపార్ట్ మెంట్ గదిలో పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తండ్రి కష్టాన్ని చూసిన చందు.. బాగా చదువుకుని అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేయగా ఉద్యోగం రాకపోవడంతో చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. యువకుడి మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జేపీ మోర్గాన్ వివాదంలో కీలక మలుపు: లోర్నా హజ్దినిపై ఆరోపణల్లో ఆధారాలు లేవు!






