- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేపీ మోర్గాన్ వివాదంలో కీలక మలుపు: లోర్నా హజ్దినిపై ఆరోపణల్లో ఆధారాలు లేవు!
జేపీ మోర్గాన్ ఎగ్జిక్యూటివ్ లోర్నా హజ్దినిపై చిరాయు రాణా చేసిన లైంగిక వేధింపులు, జాతి వివక్ష ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సంస్థ అంతర్గత విచారణలో తేలింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ ఎగ్జిక్యూటివ్ లోర్నా హజ్దిని (37) తనను లైంగికంగా, జాతి వివక్షతో వేధించారంటూ చిరాయు రాణా (35) దాఖలు చేసిన దావా ఇప్పుడు నీరుగారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్గత విచారణలో ఆయన చేసిన ఫిర్యాదులను సమర్థించేలా ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ స్పష్టం చేసింది.
అసలు ఏంటి వివాదం..
గతంలో జేపీ మోర్గాన్ ‘లీవరేజ్డ్ ఫైనాన్స్’ టీమ్‌లో పనిచేసిన చిరాయు రాణా, ఈ వారంలోనే కోర్టులో ఓ పిటిషన్ దాఖల చేశారు. అందులో ఆయన లోర్నా హజ్దిని తనకు డ్రగ్స్, రోహిప్నోల్, వయాగ్రా ఇచ్చి వేధించారని, తన మాట వినకపోతే వార్షిక బోనస్ తగ్గించేస్తానని బెదిరించారని పేర్కొన్నారు. అయితే, ఆసియా సంతతికి చెందిన తనను ‘మై లిటిల్ బ్రౌన్ బాయ్’ అని పిలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసేవారని రాణా ఆరోపించారు. అనంతరం లోర్నా తన ఫ్లాట్‌కు వచ్చి లైంగికంగా బలవంతం చేశారని కూడా చిరాయు రాణా ఫిర్యాదులో వివరించారు.
విచారణలో వెల్లడైన వాస్తవాలు ఇవే..
బ్యాంకు ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కంపెనీ హెచ్ఆర్, న్యాయవాదులు టీమ్ ఫోన్ రికార్డులు, ఈ-మెయిల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎక్కడా అందుకు తగిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదు. హజ్దిని రాణాకు నేరుగా బాస్ కాదని, వారిద్దరూ సహోద్యోగులని తేలింది. ఆమెకు ఆయన వార్షిక బోనస్‌ను నియంత్రించే అధికారం లేదని విచారణలో స్పష్టమైంది. ఈ విచారణకు అనేక మంది ఉద్యోగులు సహకరించినప్పటికీ, ఫిర్యాదు చేసిన రాణా మాత్రం వాస్తవాలను చెప్పడానికి నిరాకరించారని బ్యాంక్ పేర్కొంది. ఇక ఆరోపణలన్నింటినీ లోర్నా హజ్దిని తరపు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. తన క్లయింట్ ఎన్నాడు రాణాతో అనుచితంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. అసలు లైంగిక దాడి జరిగినట్లు చెబుతున్న ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిరాయు రాణా ‘బ్రెగల్ సేజ్‌మౌంట్’ అనే సంస్థలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.






