పాఠశాలకు వెళుతూ ప్రమాదానికి గురైన టీచర్లు.. ఒకరు మృతి

by Batti.Sumithra |   (  Updated:2026-01-17 07:50:59  IST  )

వారంతా ప్రభుత్వ టీచర్లు.. నల్లగొండ నుంచి తుంగతుర్తికి ప్రతిరోజూ పాఠశాలకు వచ్చి వెళుతుంటారు.

పాఠశాలకు వెళుతూ ప్రమాదానికి గురైన టీచర్లు.. ఒకరు మృతి
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): సంక్రాంతి సెలవుల అనంతరం విధుల్లో చేరేందుకు వెళ్తున్న ఉపాధ్యాయులను మృత్యువు కబళించింది. నల్లగొండ నుంచి తుంగతుర్తికి కారులో వెళ్తుండగా అర్వపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండకు చెందిన నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిరోజూ తుంగతుర్తికి వెళ్లి వస్తుంటారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో శనివారం ఉదయం వీరంతా కారులో విధులకు బయలుదేరారు. మార్గమధ్యలో సూర్యాపేట జిల్లా అర్వపల్లి వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో తుంగతుర్తి కేజీబీవీ (KGBV) స్పెషల్ ఆఫీసర్ (SO) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కారులో ఉన్న మరో ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది అక్కడికి చేరుకుని, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నాగారం సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ ఈట సైదులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read More... ఒక ప్రమాదం.. నాలుగు స్కూళ్లలో విషాదం

Next Story