ఉపాధ్యాయుడి దుశ్చర్య.. స్కూల్ వాటర్ ట్యాంక్‌లో విషం కలిపిన వైనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-23 06:50:36  IST  )

కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఉపాధ్యాయుడి దుశ్చర్య.. స్కూల్ వాటర్ ట్యాంక్‌లో విషం కలిపిన వైనం
X

దిశ, వెబ్‌డెస్క్: కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్‌పై ఉన్న కోపంతో సైన్స్ ఉపాధ్యాయుడు రాజేందర్ (Rajender) దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఏకంగా పాఠశాల ఆవరణలో ఉన్న విద్యార్థులు తాగే వాటర్‌ ట్యాంక్‌లో పురుగుల మందు కలిపాడు. దీంతో ఆ నీరు తాగిన మొత్తం 11 మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్ తీవ్ర అస్వస్థతకు గురై భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఉపాధ్యాయుడు రాజేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More..

OTTs: క్రైమ్ స్కూల్స్ గా ఓటీటీలు.. సహస్ర హత్య కేసు ఓ హెచ్చరిక?

Next Story