కీచక టీచర్.. పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు

by Chintha Aamani |   (  Updated:2025-08-04 15:26:00  IST  )

అభం శుభం తెలియని చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

కీచక టీచర్.. పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు
X

దిశ, సంగారెడ్డి : అభం శుభం తెలియని చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చిన్నారి(10) బాలికపై ఇంగ్లీష్ టీచర్ వినయ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడిన సంఘటన ను బాలిక తల్లిదండ్రులకు తెలుపగా దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ కు అడగగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం తో ఆగ్రహించిన తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులకు తెలుపగా పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.

పాఠశాల ఇంగ్లీష్ టీచర్ చిన్నారిపై ప్రతి రోజు అదే తరహాలో మానసికంగా వేధించడ్ , నానా బూతులు మాట్లాడటం వంటి సంఘటనలు రోజు చేస్తున్నాడని, బాలిక టీచర్ కు బయపడి విషయం చెప్పలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిని లైంగికంగా వేధింపులకు గురి చేసిన టీచర్ ను అప్పగించాలని బంధువులు ఆందోళన నిర్వహించగా పాఠశాల యాజమాన్యం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు వాహనాలలో భారీగా పాఠశాల వద్దకు చేరుకుని టీచర్ ను అరెస్టు చేశారు. పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పట్టణ పోలీసు స్టేషన్ కు తరలించి వేధింపులకు పాల్పడ్డ టీచర్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.

సెయింట్ ఆంథోనీస్ లో వరుస ఘటనలు..

గతంలో కూడా సెయింట్ ఆంథోనీస్ శాంతి నగర్ లో ఇది వరకు కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకుంది. ఇదే పేరుతో ఉన్న ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడగా పోలీసులు గతంలో కూడా టీచర్ ను అరెస్టు చేశారు. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగుతున్న పాఠశాల యాజమాన్యం టీచర్లపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలను జరుగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More : భర్త, కొడుకును వదిలేసి ప్రియుడితో పరార్..వెతికి మరీ.. తల్లిని హత్య చేసిన కొడుకు.

Next Story