భర్త, కొడుకును వదిలేసి ప్రియుడితో పరార్... వెతుక్కుంటూ వెళ్లి తల్లిని పట్టుకున్న కొడుకు.. చివరకు ఏం చేశాడంటే?

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-04 15:37:45  IST  )

ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలో తల్లిని హత్య చేశాడు కొడుకు. యశోద అనే మహిళ ఏడేళ్ల క్రితం భర్త సంజయ్ శర్మ, కొడుకు కౌశల్ శర్మను వదిలేసి మరో వ్యక్తి రామ్ నివాస్‌‌తో వెళ్లిపోయింది.

భర్త, కొడుకును వదిలేసి ప్రియుడితో పరార్... వెతుక్కుంటూ వెళ్లి తల్లిని పట్టుకున్న కొడుకు.. చివరకు ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలో తల్లిని హత్య చేశాడు కొడుకు. యశోద అనే మహిళ ఏడేళ్ల క్రితం భర్త సంజయ్ శర్మ, కొడుకు కౌశల్ శర్మను వదిలేసి మరో వ్యక్తి రామ్ నివాస్‌‌తో వెళ్లిపోయింది. అతన్ని రెండో పెళ్లి చేసుకుంది. దీంతో సమాజంలో పరువు పోయందని.. తనకు పెళ్లి కావడం లేదని తల్లిపై పగ పెంచుకున్నాడు కొడుకు. ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ వేశాడు.

మందులు తీసుకొద్దామని తల్లిని బైక్‌పై తీసుకెళ్లిన కొడుకు.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను కారులో ఎక్కించాడు. ముందుగా గొంతు పిసికి.. ఆ తర్వాత కారుతో గుద్దించి, యాక్సిడెంట్‌లా కలరింగ్ ఇచ్చారు. కానీ సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ లొకేషన్స్ ఆధారంగా దొరికిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు ఉపయోగించిన కారు, బైక్, ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

Read More : కీచక టీచర్.. పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు

Next Story