- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అద్దె ఇంటి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా!
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ అద్దె ఇంట్లో యజమాని సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ ఘటన మధురానగర్‌లో చోటు చేసుకుంది. ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఏర్పాటు చేసిన బల్బులో సీక్రెట్ కెమెరా కనిపించడంతో ఒక్కసారిగా అద్దెకు ఉన్న వ్యక్తి అవాక్కయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ అద్దె ఇంట్లో యజమాని సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ ఘటన మధురానగర్‌లోని జవహర్ నగర్‌లో చోటు చేసుకుంది. అశోక్ యాదవ్ అనే యజమాని ఎలక్ట్రీషియన్ తో ఈ పనిచేయించాడు. అశోక్ యాదవ్ ఇంట్లో 23ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగం చేసే వివాహిత భర్తతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఈ నెల 4వ తేదీన బాత్రూమ్‌లోని బల్బ్ పనిచేయకపోవడంతో ఇంటి ఓనర్‌కు చెప్పింది. ఓనర్ ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి బల్బ్ తో పాటు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాలని చెప్పాడు. సీక్రెట్ కెమెరాలో వివాహిత స్నానం చేస్తున్న వీడియోలను రికార్డ్ చేశాడు.
ఈ నెల 13వ తేదీన బాత్రూమ్‌లోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ కిందపడిపోవడంతో మహిళ తన భర్తను చూడాలని చెప్పింది. దాంతో హోల్డర్ పరిశీలించిన భర్త కంగుతిన్నాడు. వెంటనే అతడు యజమాని అశోక్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతడిని అడగాలని జంట చెప్పగా యజమాని పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని జంట చెప్పడంతో ఎలక్ట్రీషియన్ జైలు నుండి వచ్చిన తరవాత మీకు హాని చేస్తాడని వారినే బెదిరించే ప్రయత్నం చేశాడు.
దీంతో అనుమానం వచ్చిన జంట పోలీసులను ఆశ్రయించగా ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడే కెమెరా అమర్చమని చెప్పినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. ఎలక్ట్రీషియన్ చింటు పరారీలో ఉండగా పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు. బాత్రూమ్ హోల్డర్ లో సీక్రెట్ కెమెరాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది వరకు హాస్టల్స్, హోటళ్లలో మాత్రమే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా ఇప్పుడు ఇంట్లో కూడా రక్షణ లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి అద్దెకు వెళ్లే ముందు ఆ ఇంటి వాష్ రూమ్, బెడ్రూమ్ లో బల్బులను పరిశీలించుకోవడం మంచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read More..
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి






