హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-17 07:24:02  IST  )

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నితిన్ అనే వైద్య విద్యార్థి నిన్న రాత్రి విధుల‌కు హాజ‌రు కాగా ఈ రోజు ఉద‌యం ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు.

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నితిన్ అనే వైద్య విద్యార్థి నిన్న రాత్రి విధుల‌కు హాజ‌రు కాగా ఈ రోజు ఉద‌యం ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఉదయం అతడిని చూసిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. నితిన్ పారామెడికల్ విభాగంలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

VIDEO: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అద్దె ఇంటి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా!

Next Story