- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరువు హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు.. కూతురు ప్రెగ్నెన్సీ విషయం తెలిసి!
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. తమ కూతురును ప్రేమించిన శ్రవణ్ సాయి అనే యువకుడిని యువతి తల్లిదండ్రులు, సోదరుడు కొట్టి చంపేశారు.

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా బీరంగూడలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. తమ కూతురును ప్రేమించిన శ్రవణ్ సాయి అనే యువకుడిని యువతి తల్లిదండ్రులు, సోదరుడు కొట్టి చంపేశారు. కాగా మీడియాతో యువతి తల్లి సంచలన విషయాలు వెల్లడించింది. తన కూతురు నాలుగు నెలల గర్భవతి అని చెప్పింది. విషయం తనకు తెలియడంతో తన కూతరు శ్రవణ్ సాయికి మెసేజ్ చేసిందని చెప్పింది. ప్రెగ్నన్సీ విషయం మా అమ్మకి తెలిసిపోయింది అని శ్రవణ్ సాయికి చెప్పడంతో అతడు తన కూతురును కొడుతుంటే మధ్యలో అడ్డుపడ్డాడని చెప్పింది.
తప్పు చేసింది కాబట్టే తన కూతురును కొట్టానని తెలిపింది. మధ్యలో రావడంతో శ్రవణ్ సాయికి దెబ్బలు తగిలాయని ఇంకొకరి పిల్లలను నేనెందుకు కొడతానని బుకాయించింది. ఆ అబ్బాయి ఎవరో కూడా తనకు తెలియదు అని అడ్డు పడ్డాడు కాబట్టే దెబ్బలు తగిలాయని చెప్పింది.తాను ఒక్కసారి కూడా అతడిని చూడలేదని, అతడితో మాట్లాడలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే శ్రవణ్ సాయిని యువతి తల్లి దండ్రులు పెళ్లి చేస్తామని మాట్లాడేందుకు పిలిచి చంపేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More.. Breaking News.. హైదరాబాద్ లో పరువు హత్య






