Breaking News.. హైదరాబాద్ లో పరువు హత్య

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Breaking News.. హైదరాబాద్ లో పరువు హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని అమీన్ పూర్ లో పరువు హత్య జరిగింది. బీటెక్ చదువుతున్న శ్రవణ్ సాయి అదే కాలేజీలో చదువుతున్న తోటి విద్యార్థిని ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు సాయిని.. అతను ఉంటున్న అమీన్ పూర్ లోని హాస్టల్ నుంచి నిన్ను రాత్రి బయటికి తీసుకు వెళ్ళారు. ఎందుకని తోటి మిత్రులు అడగ్గా.. వారి పెళ్లి విషయం మాట్లాడటానికి ఇంటికి తీసుకువెళ్తున్నాం అని చెప్పి... బయటికి వెళ్ళిన తర్వాత అతనిపై తీవ్రంగా దాడి చేశారు.

అయితే తీవ్ర గాయాలతో సాయి స్పృహ తప్పగా.. ఆందోళన చెందిన యువతి కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story