- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ పరువు హత్య కేసులో సంచలన విషయాలు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో బీటెక్ విద్యార్థి పరువు హత్యకు గురైన కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో బీటెక్ విద్యార్థి పరువు హత్యకు గురైన కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ప్రేమ వ్యవహారమే అతని హత్యకు ప్రాథమికంగా నిర్థారణ అయింది. మృతుడు శ్రవణ్ సాయి (19)ఏపీలోని ఉమ్మడి కృష్ణాజిల్లా నందిగామకు చెందినవాడు. హైదరాబాద్ శివారు మైసమ్మ గూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న అతను.. కొన్నాళ్లుగా తన టెన్త్ క్లాస్ మేట్ శ్రీజతో ప్రేమలో ఉన్నాడు.
వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో తమ కూతురికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. యువతిని మర్చిపోబోనని శ్రవణ్ మొండిగా ఉండటంతో పెళ్లి గురించి మాట్లాడాలని చెప్పి కాల్ చేయడంతో ఒంటరిగా వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో యువతి తల్లితో గొడవ జరగ్గా.. ఆమె కోపంతో బ్యాటుతో యువకుడిని కొట్టినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన శ్రవణ్ ను వెంటనే నిజాంపేటలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. తమ కూతురితో ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా.. ఏడాదికాలంగా ఆమెను కలవలేదని ఎదురు తిరగడంతోనే బ్యాటుతో కొట్టామని, స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించామని యువతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ కేసులో పూర్తి నిజనిజాలు తేల్చేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రవణ్ హత్యపై అతని స్నేహితులు స్పందిచారు. ఏడాదిన్నర కాలంగా శ్రవణ్ - శ్రీజ ప్రేమలో ఉన్నారని, ఏడాది క్రితం ఈ విషయం శ్రీజ వారింట్లో తెలియడంతో తమ కూతురికి దూరంగా ఉండాలని హెచ్చరించారన్నారు. నాలుగు నెలలుగా శ్రీజ తనను ఇంటి నుంచి తీసుకెళ్లాలని కాల్ చేస్తోందని, ఈ క్రమంలోనే శ్రవణ్ తో పెళ్లి గురించి మాట్లాడాలని పిలిపించి చంపేశారని వాపోయారు.






