- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో ప్రైవేటు బస్సు బీభత్సం.. పలువురికి తీవ్రగాయాలు
నగరంలో ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించిన ఘటన ఇవాళ ఉదయం కత్బుల్లాపూర్ (Quthbullapur)లో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించిన ఘటన ఇవాళ ఉదయం కత్బుల్లాపూర్ (Quthbullapur)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజిపల్లి (Kajipally)లో ఉన్న RDPL కంపెనీకి చెందిన బస్సు షాపూర్ నగర్ ఆదర్శ్ బ్యాంక్ వద్దకు రాగానే బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌లతో పాటు బైకర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ఇద్దరిని స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అదేవిధంగా బైకర్ తలకు కూడా గాయాలయ్యాయి. అయితే, ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు వెల్లడించారు.
Read More..
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన భారీ కంటైనర్.. స్పాట్‌లోనే 8 మంది దుర్మరణం
Next Story






