ట్రాక్టర్‌ను ఢీకొట్టిన భారీ కంటైనర్.. స్పాట్‌లోనే 8 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-25 14:01:36  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎనిమింది అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బులంద్‌హషర్ జిల్లా అరనియా పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 43పై చోటుచేసుకుంది.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన భారీ కంటైనర్.. స్పాట్‌లోనే 8 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎనిమింది అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బులంద్‌హషర్ జిల్లా అరనియా పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 43పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ (Kasgunj) నుంచి రాజస్థాన్‌లోని గోగామేడీ (Gogamedi)లో జహర్‌వీర్ (గోగాజీ) దర్శనం కోసం 61 మంది ట్రాక్టర్‌లో బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే వారు బులంద్‌షహర్ జిల్లా పరిధిలోకి రాగానే వెనుక నుంచి ఓ భారీ కంటైనర్ వారి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదేవిధంగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి హైవేపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లుగా పోలీసులు వెల్లడించారు.

Read More..

నగరంలో ప్రైవేటు బస్సు బీభత్సం.. పలువురికి తీవ్రగాయాలు

Next Story