- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం మీదకు తెచ్చిన ఫొటోలు.. గడ్డకట్టిన చెరువులో దిగి ఇద్దరు స్పాట్ డెడ్
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన సెలా సరస్సు వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన సెలా సరస్సు (Sela Lake) వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించాలనే ఉత్సాహం ఇద్దరు పర్యాటకుల ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చలికాలం కావడంతో సెలా సరస్సు పూర్తిగా గడ్డకట్టి మంచు పలకలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లిన కొందరు పర్యాటకులు ఆ మంచుపై నిలబడి ఫోటోలు దిగాలని సరస్సు మధ్యలోకి వెళ్లారు. అయితే, వారు నిలబడిన చోట మంచు పొర ఒక్కసారిగా విరిగిపోవడంతో, ఇద్దరు పర్యాటకులు నీటిలో పూర్తిగా మునిగిపోయారు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. తీవ్రంగా శ్రమించిన అధికారులు అప్పటికే నీటిలో పడి మరణించిన ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. సరస్సులో మంచు గడ్డలు పేరుకుపోయి ఉండటం, ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉండటంతో రెండో మృతదేహం కోసం గాలింపు చర్యలు సవాలుగా మారాయి.
Read More..






