- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ప్రసిద్ధిగాంచిన అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు
నేడు తమిళనాడులోని మదురై జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అలంగనల్లూరు జల్లికట్టు పోటీలు జరగనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : నేడు తమిళనాడులోని మదురై జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అలంగనల్లూరు జల్లికట్టు పోటీలు జరగనున్నాయి. పొంగల్ పండుగ సందర్భంగా మదురై ప్రాంతంలో నిర్వహించే మూడు ప్రధాన జల్లికట్టు ఈవెంట్‌లలో ఇది చివరిదే కాకుండా అత్యంత ఫేమస్. అలంగనల్లూరు జల్లికట్టు అంటేనే ఎద్దుల - మనుషుల ధైర్యం, సాహసం సమ్మిళతమయ్యే వేదికగా పేరుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోటీలు కొనసాగుతుండగా.. వెయ్యికి పైగా ఎద్దులు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ ఎద్దులను మదురై, శివగంగై, ధర్మపురి, సేలం, కరూర్, పుదుక్కోట్టై వంటి జిల్లాల నుంచి తీసుకువచ్చారు.
దాదాపు 600 మందికి పైగా యువకులు బుల్ టేమర్లుగా పాల్గొని, జల్లికట్టు నియమాల ప్రకారం ఎద్దుల కొమ్ములు పట్టుకుని నియంత్రించడం లేదా సుమారు 50 మీటర్ల దూరం వరకు పరుగెత్తడం ద్వారా తమ సాహసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించనున్నారు. విజేతలకు కార్లు, ట్రాక్టర్లు, బైకులు, బంగారు గొలుసులు, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు నగదు బహుమతులు అందజేస్తుండగా.. మొత్తం బహుమతుల విలువ సుమారు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఉందని అధికారులు తెలిపారు.
పోటీల స్థలంలో 5–6 వైద్య శిబిరాలు, అంబులెన్సులు ఏర్పాటు చేసి డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అలాగే 2,000కిపైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. కాగా ఈ జల్లికట్టు పోటీలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఫ్లాగ్ ఆఫ్ చేసి పోటీలను ప్రారంభిస్తారు.
Read More..






