- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Crime News :Nude Call in Instagram.. యువతి ట్రాప్‌లో చిక్కుకుని యువకులు విలవిల

దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతి ఇన్‌స్టా గ్రామ్‌లో న్యూడ్ కాల్స్ పేరుతో యువకులను ట్రాప్ చేసింది. అనంతంర ఆ యువకులతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ.. వాటిని రికార్డ్ చేసింది. అనంతరం రికార్డ్ చేసిన న్యూడ్ కాల్స్, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని యువకులను బెదిరించింది. ఆ న్యూడ్ వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయాలంటే.. రూ.5 వేలు, 10 వేలు పంపాలని డిమాండ్ చేసింది. చేసేదేమి లేక కొందరు డబ్బులు పంపగా.. ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
సోషల్ మీడియా వాడకంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు నిందితులు ఓ ముఠాగా ఏర్పడి.. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. అందమైన యువతులతో వారికి వల వేసి.. న్యూడ్ కాల్స్ మాట్లాడిస్తున్నారు. ఆ వీడియోలను రికార్డ్ చేసి.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లేదంటే న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఆ వీడియోలు బయటకి వస్తే పరువుపోతుందని.. దీంతో చేసేదేమి లేక వారు అడిగినంత డబ్బు ఇస్తున్నారు. కొన్ని సార్లు వారు అడిగినంత డబ్బు ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి ఘటనలు రోజుకు ఏదో ఓ చోటు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
- Tags
- Crime News Today