ప్రధానమంత్రి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవం

by Disha Web Desk 5 |
CM KCR Announces New Pensions will be given from 15 August
X

దిశ, హనుమకొండ టౌన్ : జననాయక్ జనతా భారత్ పార్టీని జంపాల దీపక్ నేడు హనుమకొండ జిల్లా హంటర్ రోడ్‌లోని రాజ్ హోటల్ వద్ద గురువారం ఆవిర్భవించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పార్టీ భారత ప్రజల ఆకాంక్ష, అభిలాష, కోసం పుట్టిన పార్టీగా భావిస్తున్నాం. కాబట్టి ఈ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు దీపక్ ప్రకటన చేసారు. రాబోయే రోజుల్లో ఈ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తారని గౌరవిస్తూ.. ప్రజలు, మీ మద్దతును పార్టీకి ఇవ్వాలని, అలాగే ప్రజల ప్రయోజనాలను మీరు పరిగణనలోకి తీసుకొని మీ ఓటు హక్కు ద్వారా మాకు అధికారం ఇచ్చిన ఎడల, ఈ దేశాన్ని 100% అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఈ పార్టీని కేసీఆర్ చేస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఆకర్షితుడినై పార్టీ పెట్టాను అన్నారు. ఎందరో నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా అందించిన ఘనత కేసీఆర్ కి దక్కిందని అన్నారు.ఇవి కూడా చ‌ద‌వండి :

Crime News: రూమ్‌లో నగ్నంగా అక్కాతమ్ముడు.. తల్లి సడెన్ ఎంట్రీతో.

Next Story