- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Sreemukhi : ‘మహానటి’గా ముస్తాబైన అందాల భామ.. ఆ అవకాశం కోసమే ఇలా చేస్తోందా?
దిశ, సినిమా : స్మాల్ స్క్రీన్ ఫేమస్ యాంకర్ శ్రీముఖి అందరికీ సుపరితమే. ఓ వైపు టెలివిజన్ షోలతో ఆకట్టుకుంటూనే మరోవైపు సినిమాల్లోనూ చేస్తోంది. తన నటనతో, హావ భావాలతో, అందచందాలతో, చురుకైన మాటలతో ప్రేక్షకులను అరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన అనేక విషయాలను అభిమానలతో పంచుకుంటూ ఉంటుంది.
అయితే శ్రీముఖి ఇప్పటికే ప్రేమలో ఉందని, ఒక స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని గతంలో నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టగా, అదంతా నిజం కాదని ఆమె కొట్టి పారేసింది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆమె పెళ్లికి సంబంధించిన డిస్కషన్ నడుస్తోంది. ఒక వ్యక్తితో ఆమె డేటింగ్ చేస్తోందని, మరో రెండు నెలల్లో ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతోందని, ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిప్పులేనిదే పొగరాదు కదా.. నిజంగానే శ్రీముఖి పెళ్లి జరిగే అవకాశముందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.
ఇకపోతే శ్రీముఖికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఆమె ‘మహానటి’లా ముస్తాబై ఉండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీలోని ఓ కీలకపాత్రలో మెరిసి అలరించిన శ్రీముఖికి, మరోసారి బంపర్ ఆఫర్ వచ్చిందని, ఫేమస్ హీరో పక్కన ప్రధాన పాత్ర పోషించనుందనే వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి. ఇందులో భాగంగానే ఆమె ‘మహానటి’లా ముస్తాబైన ఫొటోలను పంచుకుందని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Read More..
ముఖం దాచుకుంటున్న స్టార్ బ్యూటీ..ముసుగు చాటున ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?