ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా?..అయితే తస్మాత్ జాగ్రత్త

by Dishafeatures1 |
ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా?..అయితే తస్మాత్ జాగ్రత్త
X

దిశ,ఫీచర్స్: బిజీ లైఫ్‌లో మనం తినే ఆహారపు అలవాట్లను బట్టి అనారోగ్యానికి గురి అయి ఎన్నో వ్యాధులకు మూల కారణాలు అవుతున్నాయి అని వైద్యులు అంటున్నారు.అసలు బిజీ లైఫ్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్యానికి ఏ విధమైన ఆహారం బెస్ట్? అనే విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మంది ఇంట్లో సరిగ్గా వంట చేయకుండా హోటల్ నుంచి, కర్రీ పాయింట్ల నుంచి కర్రీలు తెచ్చుకొని తినే వారు చాలా మందే ఉన్నారు. ఇక కొందరు ఏకంగా ఆ కర్రీలు ఫ్రిజ్ లో పెట్టి మరీ మూడు రోజులు అయినా తింటారు. లేదంటే ఇంట్లోనే ఒక రోజు వంట చేసి వాటిని రెండు మూడు రోజులు ఫ్రిజ్ లో పెట్టుకొని కావలసినప్పుడు వేడి చేసుకొని తింటారు. బిజీ లైఫ్ అంటూ సమయానికి ఆహారం తీసుకోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దానితో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరి డబ్బులు చెల్లించవలసి వస్తుంది.

చల్లటి ఆహారం మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని ప్రోటీన్లు, విటమిన్లు నశిస్తాయి అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని సార్లు అవి ఫుడ్ పాయిజనింగ్ అవుతాయని హెచ్చరిస్తున్నారు. అయినా ఒకసారి ఉడకబెట్టి తినవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ ఒకసారి వండిన అన్నం, సాంబార్ ఇతర వంటకాలు మళ్లీ మళ్లీ మాత్రం వేడి చేసుకొని తినకూడదు అని హెచ్చరిస్తున్నారు.

ఎప్పటికప్పుడు వేడి వేడిగా వండుకుని తినడమే ఆరోగ్యానికి మంచిది. మరి మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే ఇకనైనా మానుకోండి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి.



Next Story

Most Viewed