ఓటర్ల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నెంబర్ : కలెక్టర్

by Disha Web Desk 23 |
ఓటర్ల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నెంబర్ : కలెక్టర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్, ఏర్పాటు చేసినట్లు మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ వ్యాప్తంగా ప్రజలు, ఓటర్ల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ జిల్లా కలెక్టరేట్ లో ఇరవై నాలుగు గంటలు పని చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల నుంచి ఏదైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2050 కు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు డబ్బు తరలింపులు, ఇతర ప్రలోభాలకు గురి చేసినట్లు ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందచేయాలని, అందుకు సంబంధించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎన్నికల అధికారి, గౌతమ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed