ఉప్పల్‌లో నేడు సన్‌రైజర్స్ చివరి మ్యాచ్.. టార్గెట్ @300

by Mahesh |
ఉప్పల్‌లో నేడు సన్‌రైజర్స్ చివరి మ్యాచ్.. టార్గెట్ @300
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ జట్టు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టు గా నిలిచింది. అలాగే 167 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే చేధించి బౌలర్లకు చుక్కులు చూపించింది. అయితే చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అందరి దృష్టి నేడు పంజాబ్ తో జరగబోయే మ్యాచ్ పైనే ఉంది. ఈ సీజన్ లో భారీ ఫాల్ లో ఉన్న హైదరాబాద్ బ్యాటర్లు 300 స్కోర్ కొడతారనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో తమ హోమ్ గ్రౌండ్ లోనే ఇది సాధ్యం అవుతుందని.. అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లీగ్ స్టేజీలో ఈ రోజు చివరి మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచులో హైదరాబాద్ జట్టు కచ్చితంగా 300+ స్కోర్ చేయాలని ప్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ గెలిచి, రాజస్థాన్ గెలిస్తే,, హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. దీంతో క్వాలిఫైయర్ 1లో ఓడిపోయినా.. క్వాలిఫయర్ 2 లో ఆడేందుకు మరో అవకాశం దక్కుతుంది. దీని కోసమైన ఈ రోజ సన్ రైజర్స్ జట్టు భారీ విజయాన్ని అందుకోవాల్సి ఉంది.

Next Story