పవన్ కల్యాణ్ స్పీచ్‌పై హీరోయిన్ లయ రియాక్షన్ ఇదే.. రోజా లాగా ఉండదంటూ ఆసక్తికర కామెంట్స్! (వీడియో)

by Hamsa |
పవన్ కల్యాణ్ స్పీచ్‌పై హీరోయిన్ లయ రియాక్షన్ ఇదే.. రోజా లాగా ఉండదంటూ ఆసక్తికర కామెంట్స్! (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం వంటి భాషల్లో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే లయ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. కాలిఫోర్నియాలో ఫ్యామిలీతో సెటిల్ అయిపోయింది. మొత్తం పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇన్నాళ్లు సినిమాలకు దూరమైన లయ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు కామెంట్స్ చేస్తుంది.

తాజాగా, లయ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘ రాజకీయ నాయకులు ఇచ్చే స్పీచ్‌లు కొంచెం టిపికల్‌గా ఉంటాయి. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రోజా లాంటి వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ లా మాట్లాడుతుంటారు. కానీ పవన్ కల్యాణ్ స్పీచ్ మాత్రం అలా ఉండదు. ఆయన నిజాయితీగా, తనకి అనిపించింది మాట్లాడతారు. ఒకరిని ఆకట్టుకోవాలని ఎప్పుడు మాట్లాడరు. తను ఏం చెప్పాలనుకుంటాడో అదే చెప్తాడు. అంతే కానీ జనాలను ఆకట్టుకునే మాటలు చెప్పరు. పవన్‌లో అదే నాకు బాగా నచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లయ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సూపర్ అని ఆమెను ప్రశంసిస్తున్నారు.

Next Story