శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 20 మంది మృతి

by Harish |
శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 20 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ఆదివారం పాలస్తీనా భూభాగం మధ్యలో ఉన్న శరణార్థి శిబిరంలోని ఇంటిని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేయగా, ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు మరణించారని గాజా ఆసుపత్రి సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సెంట్రల్ గాజాలోని అల్-నుసీరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. 20 మంది మరణించడంతో పాటు చాలా మంది గాయపడ్డారు. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు, శిథిలాల కింద కొంత మంది చిక్కుకున్నారు. వారందరిని రక్షించడానికి సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వఫా నివేదించింది. అయితే దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ఈ దాడి గురించిన నివేదికను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది.

మే ప్రారంభంలో దక్షిణ నగరమైన రఫాపై ఇజ్రాయెల్ దృష్టి సారించి వరుసగా దాడుల చేస్తుంది. గాజా నుంచి తప్పించుకుని రఫాకు వచ్చిన ఉగ్రవాదులను కనిపెట్టడానికి అక్కడి ప్రాంతాలను జల్లేడ పడుతుంది. ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుండి సెంట్రల్ నుసెరాట్ శిబిరంలో భీకర యుద్ధాలు, భారీ బాంబు దాడులు ఇజ్రాయెల్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలు చాలా రోజులుగా ఘర్షణ పడుతున్నాయి.



Next Story

Most Viewed