- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Breaking: పద్మావతి యూనివర్సిటీలో వెలుగుచూసిన మారణాయుధాలు
నేడు పద్మావతి యూనివర్సిటీలో బాంబ్ డిస్పోజబుల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

X
దిశ వెబ్ డెస్క్: నేడు పద్మావతి యూనివర్సిటీలో బాంబ్ డిస్పోజబుల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో యూనివర్సిటీలో మారణాయుధాలు బయటబడ్డాయి.ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారీగా కత్తులు, హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లు లభ్యమైయ్యాయి. కాగా ఆ మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలానే మారణాయుధాలకు సంబంధించిన వివరాలను స్థానికుల నుండి సేకరిస్తున్నారు. కాగా యూనివర్సిటీలో మారణాయుధాలు దొరకడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సిట్ బృందం పద్మావతి యూనివర్సిటీ చేరుకుంది. ఈ నేపథ్యంలో దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించిన సిట్ బృందం సీఐతోపాటు సిబ్బందిని ప్రశ్నించింది. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షనలను ఎందుకు అడ్డుకోలేకపోయారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
Next Story






