BREAKING: ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. డీడీయూ మార్గ్‌లో 144 సెక్షన్ విధింపు

by Shiva |
BREAKING: ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. డీడీయూ మార్గ్‌లో 144 సెక్షన్ విధింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌ కుమార్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం కేజ్రీవాల్‌లో సహా ఆప్ ముఖ్య నేతలు అతిషి, సంజయ్ సింగ్, వివిధ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే వారంతా.. డీడీయూ మార్గ్‌లో ఉన్న బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో డీడీయూ మార్గ్‌లో 144 సెక్షన్ విధించి ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఏడు అడుగుల ఎత్తుతో బారికేడ్లతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

Next Story