పొద్దున్నే ఒక పాట వింటే రోజంతా అదే పాడుతుంటాం గమనించారా.. అలా ఎందుకు జరుగుతుందంటే..

by Dishafeatures3 |
పొద్దున్నే ఒక పాట వింటే రోజంతా అదే పాడుతుంటాం గమనించారా.. అలా ఎందుకు జరుగుతుందంటే..
X

దిశ, ఫీచర్స్: ఉదయాన్నే ఒక పాట వింటే ఆ రోజు మొత్తం అదే పాడుతుంటాం. మనకు తెలియకుండానే నోట్లో ఆ సాంగ్ నానేస్తుంది. ఈ పాట అసలు పాడొద్దని ఎంత అనుకున్నా సరే అనుకోకుండా పాడేస్తాం. మరి ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా.. అయితే దీని వెనుకున్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.


ఇన్ వాలంటరీ మ్యూజికల్ ఇమేజరీగా పిలవబడే ఈ పరిస్థితిని ఇయర్ వార్మ్స్ అని చెప్తుంటారు. దీన్నే బ్రెయిన్ వార్మ్ లేదా స్ట్రక్ సాంగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. టెంపో, మెలోడీ, క్యాచీ పాటర్న్.. మన మెదడులో ఏ పాట అయినా స్ట్రక్ అయిపోయేందుకు కారణం అవుతాయి. సింపుల్ వర్డ్స్, బాడీకి మ్యాచ్ అయ్యే రిథమ్‌‌‌‌తో కూడిన సాంగ్స్ ఇలా మైండ్‌లో నిలిచిపోయి రోజంతా గుర్తుకు వస్తుండగా.. ఎమోషన్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుందట.



Next Story

Most Viewed