- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేనల్లుడితో వివాహేతర సంబంధం.. ఇక వద్దన్నందుకు.. అన్నంత పని చేసిన అత్త!!
యూపీ సీతాపూర్ జిల్లాలో మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు పిల్లలతో పూజా మిశ్రా, ఆమె భర్త లలిత్ మిశ్రా ఢిల్లీలో హాయిగా జీవించేవారు.

దిశ, వెబ్ డెస్క్ : యూపీ సీతాపూర్ జిల్లాలో మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు పిల్లలతో పూజా మిశ్రా, ఆమె భర్త లలిత్ మిశ్రా ఢిల్లీలో హాయిగా జీవించేవారు. అయితే లలిత్‌కు పనిలో ఒత్తిడి పెరగడంతో హెల్ప్ కోసం మేనల్లుడు అలోక్ మిశ్రాను తమతో ఉండేందుకు పిలిచాడు. ఆయన తన పని చూసుకుంటే.. ఇంట్లో ఉన్న భార్య, పిల్లలకు సాయం చేస్తాడని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. 20 ఏళ్ల అలోక్‌తో 35ఏళ్ల అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిశాక లలిత్ అతన్ని ఇంటి నుంచి తరిమేశాడు. అయితే పూజ అతనిని విడిచి ఉండలేక.. తనతో కలిసి బరేలీ వెళ్లిపోయింది. ఏడు నెలలు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నాక.. అసలు ట్విస్ట్ జరిగింది.
ఇక పూజతో ఉండలేనని.. ఈ రిలేషన్‌కు ఎండ్ చెప్పేస్తానని చెప్పాడు అలోక్. దీంతో వాగ్వాదం జరిగింది. కేసు పోలీస్ స్టేషన్‌కు చేరింది. అక్కడ కూడా ఇదే విషయాన్ని అలోక్ స్పష్టంగా చెప్పడంతో.. అక్కడే బ్లేడ్‌తో చేయి కట్ చేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసింది. దీంతో పీఎస్‌లో గందరగోళం నెలకొనగా.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తుండగా.. పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read more : వచ్చే నెలలో పెళ్లి.. మరిదిని బెడ్‌రూంలోకి పిలిచి ప్రైవేట్ పార్ట్ కోసేసిన వదిన






