వచ్చే నెలలో పెళ్లి.. మరిదిని బెడ్‌రూంలోకి పిలిచి ప్రైవేట్ పార్ట్ కోసేసిన వదిన

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-10-22 13:34:40  IST  )

స్వార్థం ఎంతటి తెగింపుకైనా పాల్పడేలా చేస్తుంది. పగ, ద్వేషాన్ని పెంచుతుంది. ఈ క్రమంలో ఎదుటివాళ్లు కుటుంబీకులు, రక్త సంబందీకులు అని కూడా ఆలోచించనీయదు.

వచ్చే నెలలో పెళ్లి.. మరిదిని బెడ్‌రూంలోకి పిలిచి ప్రైవేట్ పార్ట్ కోసేసిన వదిన
X

దిశ, వెబ్‌డెస్క్ : స్వార్థం ఎంతటి తెగింపుకైనా పాల్పడేలా చేస్తుంది. పగ, ద్వేషాన్ని పెంచుతుంది. ఈ క్రమంలో ఎదుటివాళ్లు కుటుంబీకులు, రక్త సంబందీకులు అని కూడా ఆలోచించనీయదు. ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా నేరాలకు పాల్పడేలా చేస్తుంది. ఇలాంటి సంఘటనే ఉత్తర ప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. ఉద్యోగస్తుడు అయిన మరిది.. తన చెల్లిని కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వదిన.. అతడిని ఇంట్లోకి పిలిచి ప్రైవేట్ పార్ట్‌ను కోసి పంపించింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..

యోగేష్ కుటుంబానిది ఆగ్రాలోని బర్హన్ ప్రాంతం. ఇంజనీరింగ్ చేసిన అతడు హల్ద్‌‌వాణీలో ఉంటూ అల్ట్రాటెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటివద్ద తల్లిదండ్రులతోపాటు అతని సోదరుడు రాజ్ బహుదూర్, వదిన అర్చన ఉంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగస్తుడు అయిన యోగేష్‌కు తన చెల్లెలిని ఇచ్చి వివాహం చేయాలని ఆమె భావించింది. చెల్లెలు కూడా ఇదే ఇంటికి కోడలిగా వస్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని కలలుకనింది. కానీ యోగేష్‌కు మెయిన్‌పురికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇటీవలనే నిశ్చతార్థం కూడా చేసుకున్నారు. నవంబర్‌లో పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే నిన్న దీపావళి పండుగ జరుపుకునేందుకు యోగేష్ ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత అర్చన.. యోగేష్‌ను తన బెడ్‌రూంలోకి తీసుకెళ్లింది. అక్కడ తన చెల్లెల్లిని పెళ్లి చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. కానీ యోగేష్ ఆమె మాట వినలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన అర్చన.. తన చెల్లెలికి దక్కని నువ్వు వేరే అమ్మాయికి కూడా దక్కవద్దని మరిది పురుషాంగాన్ని కోసిపడేసింది. అతడి అరుపులు విన్న కుటుంబీకులు ఇంట్లోకి వచ్చేసరికి ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు వచ్చి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. యోగేష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అర్చనతోపాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

Read more telangana district news

Next Story