- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. యువతిని ముక్కలు ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి!
రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితురాలైన యువతిని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర(35) నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల రవీంద్ర భార్య విజయనగరంలోని పుట్టింటికి వెళ్లారు. దీంతో ఇప్పటికే ఆయనకు పరిచయం ఉన్న విశాఖకు చెందిన మౌనిక(29) అనే యువతిని ఆదివారం రాత్రి తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. ఆ తర్వాాత కాసేపటికే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం ఆమె బాడీ పార్ట్స్‌ను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అక్కడినుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ వచ్చిందని.. ఆ కోపంలోనే కత్తితో మౌనికను చంపి, ముక్కలుగా కోసి సగ భాగాన్ని ఫ్రిడ్జిలో ఉంచి, మరో సగ భాగం మూట కట్టి ఇంట్లో మూలకు పెట్టి రవీంద్ర పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.






